మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన స్టైల్లో కాజల్ జవాబిచ్చింది. రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లలో ఎవరిని చంపుతావు..ఎవరితో లేచిపోతావు..ఎవరిని పెళ్లిచేసుకుంటావు అన్న ప్రశ్నలకు కాజల్ రామ్‌చరణ్‌ను చంపుతా..ఎన్టీఆర్‌తో లేచిపోతా..ఛాన్స్ ఉంటే ప్రభాస్‌ను పెళ్లిచేసుకుంటా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అలాగే పవన్‌కల్యాణ్, చిరంజీవిలతో నటించిన కాజల్ వారి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పవన్‌తో చాలా క్లోజ్ అనే ఫీలింగ్ వచ్చింది..చిరంజీవితో సహా ఇంకెవ్వరి మీద నాకు క్లోజ్ అనే ఫీలింగ్ రాలేదు అంటూ కాజల్ హాట్ కామెంట్స్ చేసింది. అయితే పవన్‌తో క్లోజ్ అనే ఫీలింగ్ తనకు ఎందుకు వచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదంటూ కాజల్ చెప్పుకొచ్చింది. పవర్‌స్టార్‌తో కాజల్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో నటించిన విషయం విదితమే.. మొత్తంగా టాలీవుడ్ స్టార్ హీరోలపై ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై క్లోజ్ అనే ఫీలింగ్ వచ్చిందన్న కాజల్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.