భారత జట్టులో ప్రస్తుతం మారుమోగుపోతున్న పేరు ఎవరిదీ అంటే అది హిట్ మాన్ రోహిత్ శర్మ నే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలని నిర్ణయిస్తే, ఎందరో ఆ స్థానానికి రోహిత్ సరిపోడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వీరి మాటలకు బ్రేక్ వేసి రోహిత్ ఓపెనర్ గా వచ్చి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 మ్యాచ్ లలో ఫామ్ లో ఉన్న రోహిత్ ఇప్పుడు టెస్టుల్లో కూడా ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో ఇండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు రోహిత్ కు కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. ఇంతకముందు ఇండియాకు నిదహాస్ ట్రోఫీ కూడా రోహిత్ కెప్టెన్సీ లోనే వచ్చింది. ఇక ఇవన్నీ చూస్తుంటే టీ20 లకు కెప్టెన్సీ భాద్యతలు పూర్తిగా రోహిత్ తీసేసుకుంటాడు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
