ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ అనే విషయానికి వస్తే అందరు సంతోషంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇక మరోపక్క చంద్రబాబు మాత్రం ఎక్కడ తప్పు జరుగుతుందా, ఎలా ఇరికించాలానే ఆలోచనలో ఉన్నాడు. ఈ సమయంలోనే బాబుకి దీపావళి కానుక ఇచ్చాడు వల్లభనేని వంశీ.
టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యే గా పోటీ చేసి ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. అయితే ఈ మేరకు ఇక్కడ ఎన్నికలు మల్లా జరగడం ఖాయం. అయితే ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అనే విషయానికి వస్తే ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి అక్కడ వారే గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే టీడీపీ, జనసేన పరిస్థితి ఏమిటీ..? అక్కడ ఎవరు పోటీ చేస్తారు..? ఇక్కడ టీడీపీ తరపున లోకేష్, మరోపక్క పవన్ పోటీ చేస్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ రాజధాని ప్రాంతంలో దారుణంగా ఓడిపోగా, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేక ఉన్న కాస్తా పరువు పోగొట్టుకున్నాడు. ఇక వీళ్ళు గన్నవరంలో అడుగుపెడితే గంగాపాలే అని చెప్పాలి.