అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్‌లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో విజయ్ ఉన్నాడు. ఇల్లంతా తనిఖీలు చేశారు.తనిఖీ చేయగా బాంబులేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎందుకైన మంచిదని విజయ్ ఇంటి దగ్గర తగిన భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విజయ్ తండ్రి ఇంటి దగ్గర కూడా తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత కాల్ వచ్చిన ఫోన్ కాల్ నెంబర్ ను విచారించగా అది గాలికి తిరిగే ఒక యువకుడు ఫేక్ కాల్ అని తేలింది.