తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్న యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. డిప్యూటి కార్యదర్శిగా ఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. వికారబాద్ సబ్ కలెక్టర్‌గా రంగారెడ్డి జిల్లా జెసిగా సేవలందించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్ అర్భన్ కలెక్టర్‌గానూ సేవలందించారు.
