ఈ నెల 31న హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని ఆయన ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు. 800 మందికి ఒక పోలింగ్ కేంద్రం, మొత్తం 8,056 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో అభ్యర్థి ఖర్చు రూ. లక్ష, కార్పొరేషన్‌లో అభ్యర్థి ఖర్చు రూ. లక్షా 50 వేలు మించకుండా ఉండాలన్నారు.
