తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 కి ప్రత్యేక ఆకర్షణ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీముఖి పేరు ప్రముఖంగా ఉంటుంది.ఆమె ఎనర్జితో బిగ్‌బాస్ హౌస్‌ను దుమ్ము రేపుతుంది. టాప్ 5కు అర్హత సాధించింది. అయితే గతవారంలో ఇంటి సభ్యులు…వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో జరగని చర్చ లేదు..వెతకని వీడియో లేదు. అంతల వెతుకుతున్నది ఎవరి కోసం అనుకున్నారు..అదేనండి బిగ్‌బాస్ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించినప్పుడు శ్రీముఖి ‘అందరు అమ్మాయిల లాగే నా జీవితంలోనూ రిలేషన్‌షిప్స్ ఉండేవి. అతనితో అంతా బాగుంది అనుకున్న సమయంలో డిస్టబెన్స్ ఎదురయ్యాయి. ఓ రోజు ఆకస్మాత్తుగా స్టేజీపై యాంకరింగ్ చేస్తున్నపుడు నాకు బ్రేకప్ అయిపోయిందన్న వార్త వచ్చింది. నేను పక్కకు వెళ్లి ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అవన్నీ పక్కనపెట్టి.. అప్పుడు నేను చేస్తున్న కామెడీ షోను నవ్వుతూనే పూర్తి చేశాను. బ్రేకప్ తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను అని అనడంతో ఇక శ్రీముఖి బ్రేకప్ చెప్పింది ఎవరు..శ్రీముఖి చేప్పిన ఆ లవర్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ మొదలైంది. మరి ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పడాలంటే మళ్లీ శ్రీముఖి అతడేవరో చెబితేగాని సోషల్ మీడియాలో ఆగేటట్లు కనపడడం లేదు.
