Home / ANDHRAPRADESH / గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!

గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతే కాదు వైసీపీ నేతల కుట్రలు, అధికారుల వేధింపులతో విసుగుచెంది తన వర్గం వారిని కాపాడుకోవడం కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వంశీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు వంశీ స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా వంశీ మైండ్ గేమ్ ఆడడంలో సిద్ధహస్తుడని వైసీపీ నేతలు అంటున్నారు. వంశీ ఎన్నికలలో గెలిచేందుకు ఏకంగా ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి, పేదలకు అక్రమంగా ఇండ్ల పట్టాలు పంచాడనివారు ఆరోపిస్తున్నారు. వంశీ అనేక తప్పులు చేశాడని, వాటిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారే కానీ..ఎక్కడా రాజకీయంగా వేధించడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.. టీడీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలపై 4 వేల కేసులు పెట్టారని…మరి వాటిపై వంశీ కాని, చంద్రబాబు కాని ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

కేవలం తన పదవిని కాపాడుకోవడంతో పాటు, నియోజకవర్గంలో సానుభూతి కోసం వంశీ రాజీనామా డ్రామా ఆడుతున్నాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వంశీ తమ పార్టీలోకి రావడం గన్నవరం వైసీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని, వైసీపీ శ్రేణులు అంటున్నాయి. నిజానికి వైసీపీలో చేరేందుకు సీఎం జగన్‌ను వంశీ కలిసాడు…కాని గన్నవరం వైసీపీ శ్రేణుల్లో తన పట్ల ఎదురవుతున్న వ్యతిరేకతను చూసి వంశీ వ్యూహం మార్చి వైసీపీ నేతల కుట్రలు, అధికారుల వేధింపులు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే టీడీపీ నేతలపై జగన్ సర్కార్ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈ తరుణంలో వంశీ వైసీపీ నేతల వేధింపుల వల్లే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం పట్ల ఇదంతా,..బాబు స్కెచ్ మేరకు జరుగుతున్నట్లు డౌట్లు వస్తున్నాయి. మొత్తంగా సీఎం జగన్ చెప్పినట్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీలో చేరేందుకు సిద్ధమైన వంశీ తన చేరిక పట్ల స్థానికంగా ఉన్న వ్యతిరేకతను చూసి, రూట్ మార్చాడని తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా, చంద్రబాబుకు లేఖ ఇచ్చాడు. అయితే బాబు మాత్రం తన రాజీనామాకు అంగీకరించడు. దీంతో తాను పేరుకు రాజీనామా చేసినా, బాబు ఆమోదించేవరకు ఎమ్మెల్యేగానే కొనసాగుతాడు. మరోవైపు ప్రజల్లో సింపతీ పెరుగుతోంది. అలాగే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్‌ను కట్టడి చేసినట్లు అవుతుంది. మొత్తంగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయకుండా…వంశీ మైండ్ గేమ్ ఆడుతున్నాడని గన్నవరంలో చర్చ జరుగుతోంది. మరి వంశీ రాజీనామా వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat