తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఘోర పరాజయం చవిచూడడంతో ఆమె భర్త, పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఖాయమని మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో తొలుత ఉత్తమ్ సతీమణి పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి రేవంత్ రెడ్డి, తన వర్గానికి చెందిన కిరణ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన సతీమణికే టికెట్ కేటాయింపజేసుకుని పార్టీలో తన పట్టును నిలబెట్టుకున్నారు. అయితే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారడంతో రేవంత్ రెడ్డితో సహా, కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ప్రచారం నిర్వహించారు. అయినా పద్మావతి ఘోర పరాజయం చవి చూశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ పీసీసీ పదవి ఊస్టింగే అని కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. పీసీసీ అధ‌్యక్ష పదవిపై కన్నేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన వంతు ప్రయత్నాలు ఆరంభించాడు. అయితే రేవంత్ తీరుపై ఉత్తమ్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఉత్తమ్, రేవంత్ రెడ్డిలపై తనదైన స్టైల్లో స్పందించాడు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఓటమి పాలైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓదార్చాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. గతంలో సైన్యంలో పని చేసే ఉత్తమ్ చాలా ధైర్యవంతుడని , హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రానా ఆయన పీసీసీ పదవి ఎక్కడకు పోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉత్తమ్ పదవిపై కన్నేసిన రేవంత్ రెడ్డి పరువు తీసేలా జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశాడు. తాజాగా హుజూర్‌నగర్‌లో ఎదురైన ఓటమి కారణంగా సానుభూతితో ఉత్తమ్ హీరో అయ్యారని, కానీ ఈ ఎన్నికల్లో చక్రం తిప్పిన రేవంత్ మాత్రం జీరో అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసిన పార్టీ గెలవలేకపోయిందని..కాబట్టి ఆయన హీరో ఎలా అవుతాడు..జీరోనే అని జగ్గారెడ్డి ఓపెన్‌గా చెప్పాడు. మొత్తంగా పీసీపీ అధ్యక్ష పదవి ఉత్తమ్ చేతిలోనే ఉంటుందని..రేవంత్ రెడ్డి లాంటి జీరోలకు దక్కదని జగ్గారెడ్డి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేశాడు
