ఈ దీపావళి ఏపీలో ఎందరో నిరుద్యోగ యువతకు నిజమైన దీపావళి. .సీఎం జగన్ చేసిన మంచి పని…ఫోటోలో కనిపిస్తున్న ఈ అంధ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న యువతకు వారి స్వగ్రామాలలోనే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వైసీపీ సర్కార్ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే ఈ గ్రామ వాలంటీర్ల విధి. ఇన్నాళ్లు ఉద్యోగం, సజ్జోగం లేదని వెక్కిరించిన వారే ఇప్పుడు గ్రామవాలంటీర్లను గౌరవంగా చూస్తున్నారు. అయితే గ్రామవాలంటీర్ల ఉద్యోగాలు అంధులకు కూడా లభించాయి. దీంతో ఇన్నాళ్లు చూపు లేక, చేసేందుకు పని లేక బతికేందుకు అవస్థలు పడుతున్న అంధుల జీవితాల్లో సరికొత్త వెలుగులు వస్తున్నాయి. ఫోటోలో కనిపిస్తున్న ఈ అంధ యువకుడి పేరు… గొల్లపల్లి శ్రీనుబొబ్బలి మండలానికి చెందిన ఈ అంధ యువకుడికి కంటిచూపు లేదని చిన్నచూపు చూడకుండా..ప్రభుత్వం అతనికి గ్రామవాలంటీర్ ఉద్యోగం కల్పించింది. జగన్ సర్కార్ ఇచ్చిన ఉపాధి శ్రీను జీవితాన్నే మార్చేసింది. పట్టుదలతో ఎంతటి కష్టమైనా పని చేస్తున్నా ఇన్నాళ్లు లభించని గుర్తింపు సీఎం జగన్ వల్ల దొరికిందని శ్రీను ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నేను బ్లైండ్‌ని.. ఈ రోజు నా లైఫ్‌లో వెరీ హ్యాపీ డే. ముందుగా వలంటీర్‌గా ఉద్యోగం కల్పించిన వైఎస్ జగన్ గారికి నా హదయ పూర్వక ధన్యవాదాలు. ఈ రోజు రైతు భరోసా అమౌంట్ పడిందని ఒక రైతు ఇంటికి వచ్చి స్వీట్ బాక్సు కూడా కొని అభిమానంతో ఇచ్చాడని శ్రీను చెప్పుకొచ్చాడు. మంచిగా ఉంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ రోజు తెలిసింది. ఇందుకు సహకరించిన అగ్రికల్చరల్ ఆఫీసర్, పీఈఓ మేడం, తోటి వలంటీర్స్‌కి స్పెషల్ ధ్యాంక్స్ అంటూ శ్రీను ఉద్వేగానికి గురయ్యాడు. చూశారుగా.. అంధుడైన నిరుపేద యువకుడి జీవితంలో వెలుగులు నింపిన నాయకుడు సీఎం జగన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫోటోలో రైతు భరోసా అందుకున్న రైతు సంతోషంగా అంధుడైన గ్రామవలంటీర్‌కు స్వీట్ తినిపించడం ప్రతి ఒక్కరిని ఆకట్టకుంటోంది. రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు వెలిగిస్తున్న ప్రజానేత..సీఎం జగన్ అని వైసీపీ అభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
