టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే ఇంకేముంది ప్రముఖ యాంకర్.. సుమ కనకాల అని వేరే చెప్పాలా అని అంటారు.పది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరిచుకున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. పలు సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా తన అనర్గలంగా మాట్లాడే చతురతతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా వారం రోజుల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్‌ప్రైజ్ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!