కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు . తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. తాజాగా అందిన సమచారం ఈనెల 29వ తేదీన గన్నవరం టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నారు. గతవారంలో మంత్రులు కొడాలినాని, పేర్నినానితో కలిసి వంశీ జగన్మోహన్ రెడ్డితో భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండే వంశీ వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం మొదలైంది. అన్నట్టుగానే ఈరోజు టీడీపీకి రాజీనామా చేశారు వంశీ. అంతేకాదు జగన్ చెప్పినట్లు తన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావలన్న విధంగానే నేడు రాజీనామా చేశారని తెలుస్తుంది.ఇక ఈనెల 29వ తేదీన వంశీ చేరిపోవడం ఖాయం.