వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో వంశీ జగన్ను ఆలింగనం చేసుకున్నారు అప్పట్లో రాజకీయంగా ఇది పెద్ద చర్చగా మారింది. అయితే వంశీ రాజకీయంగా తనను ఎంత అవమానించినా జగన్ ని కలిసినందుకు అంశంపై పార్టీ అధిష్టానం ఎంత గుర్రుగా ఉన్న ఏనాడు పార్టీ సిద్ధాంతాలను అతిక్రమించలేదు. అనంతరం పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది అయితే జగన్ పార్టీలో చేరాలంటే ప్రత్యర్థి పార్టీ నుంచి లభించిన పదవిని వదులుకోవడానికి సిద్ధమవ్వాలి. తాజాగా ఆ పదవిని వదులుకోవడానికి వంశీ సిద్ధం కావడంతో జగన్ వంశీని పార్టీలోకి స్వాగతించారు. అయితే ఇప్పటికే తనతో కలిపి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబుకు ఉన్న ఒక్కగానొక్క బలమైన ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వంశీ బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు గానీ వెళ్ళిపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయిపోద్ది అని చంద్రబాబు అండ్ కో తలలు పట్టుకుంటున్నారు.
