అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. దీపావళి సందర్భంగా ఈ ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు పార్టీ ఘోర పరాజయం పాలైంది అనే రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆ ప్రజల పై సంతకాలు చేయడం సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మధ్యలో కేంద్ర రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి అనే భావన తీసుకువచ్చి అక్కడ అక్కడ మోడీ క్యారెక్టర్లు కనిపించాయి. జగన్ సీఎం అయిన తర్వాత విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించిన విషయాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. నేను కూడా విజయవాడలోనే ఉంటున్నాను సంగతి మర్చిపోవద్దు అంటూ జగన్ క్యారెక్టర్ మాట్లాడుతున్న డైలాగ్ ను హైలెట్ చేశారు. రౌడీయిజం రాజకీయం కలిసిన విజయవాడను కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం ధనరాజ్ వంటి పాత నటులు కూడా ఈ సినిమాలో కనిపించారు. అక్కడక్కడ కామెడీ కూడా అదే ప్రయత్నాలు చేశారు నూటికి 1000% మేమే గెలుస్తాం అంటూ కే ఏ పాల్ మాట్లాడిన మాటలను వ్యంగ్యంగా చూపించారు. ముఖ్యంగా నారా లోకేష్ ఇంట్లో ఏడుస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు పప్పు వడ్డిస్తూ వర్ణ సంఘటనను గుర్తు చేస్తూ కామెడీ చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్ల ట్రైలర్ అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి మరింత రాజకీయంగా వివాదాలు రేపే ప్రయత్నం చేస్తుందని కొందరు అంటున్నారు.
