తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి గన్నవరం బరిలో దింపుతున్నారు. ఇక్కడే మిగిలిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల కోసం ఇప్పటికే చర్చ మొదలైంది అయితే ఇక్కడ రెండు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి మాజీ మంత్రిగా ఉండి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ బరిలోకి దిగుతున్నారుట. ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పోవడాన్ని జనసేన సైనికులు తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు. కేవలం పార్టీ ఎమ్మెల్యేలందరూ ఓడిపోయి తాను కూడా ఒకే ఒక ఎమ్మెల్యే కలవడంతో వారంతా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రాజధాని ప్రాంతం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకే మాయని మచ్చగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత ఉంది ప్రజావ్యతిరేకతను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటుందని ప్రచారం చేస్తున్న ఇరు పార్టీల అగ్రనేతలు బరిలోకి దిగి గెలుస్తారా లేదా అనేది వేచి చూడాలి.
