తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి జన్మదిన వేడుకలకు హాజరకావాలని టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కోరగా గవర్నర్ సుందరరాజన్ విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి జన్మదిన వేడుకలకు హాజరవుతారని చెప్పారు. దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు
