వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా నేనే సీఎం అనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే శ్రీకాకుళం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం జగన్‌పై వ్యతిరేకత ఏర్పడిందని..ప్రజలు నన్నే సీఎంగా కోరుకుంటున్నారంటూ…గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలాగే తెలంగాణలో పార్టీ పూర్తిగా క్లోజ్ అయినా…ఇంకా తనకు తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బిల్డప్ ఇచ్చుకుంటాడు. అయితే తెలంగాణలో ఉనికి కోసం హుజూర్‌నగర్ ఉపఎన్నికలలో పోటీ చేసిన టీడీపీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి 43 వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి నిలువగా బీజేపీ, టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. కేవలం 1827 ఓట్లతో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాభవం ఎదుర్కొంది. అయినా ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. మళ్లీ తనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నారాచంద్రబాబునాయుడు గారు కలవరిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమే. పోలైన ఓట్లలో ఒక శాతం కూడా రాని పార్టీకి బాబుగారు జాతీయ అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలనను చూసి ఓర్వలేకనే.. ఏం చేయాలో అర్థంగాక చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అవును..రాహుల్‌గాంధీని సన్యాసం పుచ్చుకునేలా చేసిన జాతీయ అధ్యక్షుడు…దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమాధి చేసిన జాతీయ అధ్యక్షుడు..ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని రెండు రాష్ట్రాల్లో సర్వనాశనం చేసిన జాతీయ అధ్యక్షుడు అంటూ..నెట్‌జన్లు పెద్ద ఎత్తున బాబుపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం బాబుపై విజయసాయిరెడ్డి చేసిన సెటైరికల్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
