సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తున్నది. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు .ఈరోజు ఉదయం విజయశాంతి లుక్ ను రివీల్ చేశారు . దీంతో కాసేపట్లోనే సోషల్ మీడియాలో ఆ పోస్టర్ హల్ చ్ల చేస్తుంది. ఇకపోతే అదే విధంగా సాయంత్రం 5:04 గంటలకు మహేష్ బాబు కొత్త లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం విజయశాంతి, సాయంత్రం మహేష్ బాబులు సోషల్ మీడియాలో సందడి చేయబోతున్నారన్నమాట.
Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru ?
Can't-Wait for Sankranthi 2020 ?
Wishing you all a Very Happy Diwali ?@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR
— Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019