తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా చేసి వైసీపీలో చేరిన వైసీపీ టిక్కెట్ పై గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వెంకటరావు పోటీ చేస్తారట. ఇది ఎలా అంటే దానికి ఓ కారణం చెబుతున్నారు. వంశీని రాజ్యసభకు పంపే లా జగన్ మాట్లాడారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేసిన వంశీ ఈసారికి రాజ్యసభకు వెళ్తారని ఆ వచ్చే ఎన్నికల నాటికి అప్పుడు పరిస్థితులు అవకాశాలను బట్టి అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే అనేది డిసైడ్ చేద్దామని అనుకున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఒక వైపున గన్నవరం నియోజకవర్గం వంశీ చేతిలో ఉంటుంది మరోవైపు రాజ్యసభలోనూ అని అడుగు పెట్టడం రాజకీయాల్లో కష్ట కొత్తదనాన్ని సంతరించుకుంది.
