దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..?
* జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు
* టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి
* చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
* పెద్దలు నిత్యం వార్ని గమనిస్తూ టపాసులు కాల్చేలా చర్యలు తీసుకోవాలి
* టపాసులు కాల్చిన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి
* ప్రాథమిక చికిత్స సామాగ్రిని అందుబాటులో పెట్టుకోవాలి
* చిన్న పిల్లలు,ముసలి వాళ్లు,గుండె సంబంధిత సమస్యలున్నవారున్న చోట పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే టపాసులు కాల్చకూడదు
Tags care childrens Diwali oldage slider take tapas WOMEN