టీడీపీ అధినేత నారావారి పుత్రరత్నం నారా లోకేష్ చేసే కామెడీని మాటల్లో వర్ణించలేము. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి పెట్టుకున్నట్లే అన్నా….అంబేద్కర్ వర్థంతిని జయంతి అని చెప్పినా, రిపేర్ వచ్చేదాకా..మన సైకిల్‌ను గుద్ది గుద్ది నాశనం చేయాలని కార్యకర్తలనే అవాక్కయ్యలే చేసినా, 2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని చర్చ జరిగినప్పుడు.. ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారు అని నవ్వులు పూయించినా అది లోకేష్‌కే చెల్లింది. అయితే లోకేష్ తరహాలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పలుమార్లు బహిరంగవేదికలపై నోరుజారుతూ నవ్వులపాలవుతుంటారు. తరచుగా పుస్తకాలు చదువుతాను అని పవన్ చెప్పకుంటాడు. అంతే కాదు బహిరంగ సభలకు వెళ్లేటప్పుడు కూడా పుస్తకాలు పట్టుకుని వెళతాడు. కాని చరిత్రకు సంబంధించిన విషయాల్లో మాత్రం లోకేష్‌లాగా పవన్ కూడా పప్పులో కాలేస్తుంటాడు. తాజాగా పవన్ చైనా యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీగా మారాయి. 1962లో జరిగిన ఇండో – చైనా వార్‌లో చైనా భారత భూభాగాన్ని కొద్ది మేర ఆక్రమించుకుంది. అప్పుడు పవన్ ఐదవ తరగతి చదువుతున్నాడంట..చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న తెలుసుకుని ఆవేదన చెందాడంట.. సంఘర్షణకు గురై చివరకు జనసేన పార్టీ పెట్టాడంట..ఇలా పవన్ చైనా యుద్ధం చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫుల్లుగా సెటైర్లు పడుతున్నాయి. వాస్తవానికి పవన్ పుట్టింది 1971లో…పవన్ చెప్పిన ప్రకారం 5 వ తరగతి చదివేటప్పుడు 1981-82 అయి ఉంటుంది. మరి 1962లో చైనా యుద్ధం జరిగితే..పవన్ అప్పుడు 5 వ తరగతి ఎలా చదివాడు.. చైనా భారత్‌ను ఆక్రమించిదన్న విషయం 20 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాడా..అయినా చైనా యుద్ధానికి, పార్టీ పెట్టడానికి లింకేంటి అని నెట్‌జన్లు కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ అవుతోంది. అయితే పవన్ చైనా వార్ ప్రసంగానికి జనసైనికులు చప్పట్లతో మోతక్కించడం ఇందులో కొసమెరుపు. మొత్తంగా పవన్ కల్యాణ్, లోకేష్‌లు తమ కామెడీ ప్రసంగాలతో నవ్వులపాలవుతున్నారనే చెప్పాలి.