రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వీరందరికీ పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని కాలువలు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకను తీయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి పవన్ కళ్యాణ్ రెండు రకాల స్టేట్మెంట్లు ఈ సందర్భంగా ఇచ్చారు.. ఒకటి వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇసుకను రవాణా చేస్తున్నారని వారికి మాత్రం పెద్దఎత్తున లభ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
మరోవైపు ఇసుక లభ్యత లేక రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల అనేక మంది కొన్ని లక్షల మంది రోడ్డున పడుతున్నారని అన్నారు.. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయారు ఒకవేళ నిజంగా వైసీపీ నాయకులకు ఇసుక దొరికితే వాళ్ళు ఎక్కడ దాచి పెట్టరూ కదా.. కన్స్ట్రక్షన్ కే వాడతారు కదా.. వాళ్ళు నిర్మాణ రంగానికి వాడినప్పుడు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారు లేదు ఆ స్టేట్మెంట్ తప్పైతే గనుక రాష్ట్రంలో ఇసుక కొరత లేనట్టు ఒకవేళ ఉంటే వారు పని చేసుకుంటున్నట్టు. కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.. వైసీపీ నాయకులకు ఇసుక దొరుకుతుందని చెప్తూనే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఖాళీగా ఉంటున్నారని అన్నారు.