తెలంగాణ రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలకు ,పురపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది .ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది .2019 జనవరి 1 నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు
