తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు గత ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యలకు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి నే కారణం.
ఒకవైపు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని సర్కారు చేబుతున్న కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు అశ్వత్థామ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశరు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఆర్టీసీ విధులకు .. ప్రజలకు అటంకం కలిగిస్తున్నారని కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడం పై టీజేఎస్ అధినేత కోదండరామ్ స్పందిస్తూ ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము. అశ్వత్థామరెడ్డిపై నమోదైన కేసును కూడా ఖండిస్తున్నామని ఆయన మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.