బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్ అండ్ క్లాస్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే మరో యాంగిల్‌లో తన చూపుతోనే విలన్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుందా లేక క్లాస్‌గా కనిపించనుందా అనేది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru ?
Can't-Wait for Sankranthi 2020 ?
Wishing you all a Very Happy Diwali ?@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR
— Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019