కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ స్వాగతించినట్టు సమాచారం. ఇక వంశీకి వైసీపీలో దక్కుతున్న క్రేజ్ చూసి మరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు రెడీ అయ్యారట.. ఇదే జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతవ్వడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఏపీ అసెంబ్లీలో 10శాతం సీట్లు సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ లెక్కన 18 సీట్లు ఉంటే చాలు. కానీ చంద్రబాబుకు అసెంబ్లీలో 23 ఎమ్మెల్యే సీట్లున్నాయి. ఇప్పుడు 10 మంది కనుక వైసీపీ లో చేరితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గల్లంతుకావడం ఖాయం. దీపావళి తర్వాత ఏపీ రాజకీయాల్లో ఈ మార్పులు శరవేగంగా జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
