సాధారణంగా బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటారు . కానీ స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎప్పుడు ఎలా ఏ సమయంలో బీపీ మాత్రలు వేసుకోవాలో తేల్చి చెబుతున్నారు . బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటే అంతగా ఉపయోగం ఉండదు . రాత్రి పడుకునే ముందు వేసుకుంటే ఎక్కువగా పని చేస్తాయని వారు చెబుతున్నారు . పడుకునే ముందు బీపీ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుంది . గుండె సంబధిత వ్యాధులు కూడా సగానికి పైగా తగ్గాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనలు పంతొమ్మిది వేల మందిపై చేశారు
