Home / Uncategorized / చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..?

చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..?

ఏపీలో టీడీపీ త్వరలోనే అంతరార్థం కానుందా..బాబుగారి సారథ్యంలోని టీడీపీ పూర్తిగా కాషాయపార్టీలో కలిసిపోతుందా..లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతాడా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాబుగారి ఆర్థిక మూలాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే చంద్రబాబే మళ్లీ మోదీ పంచన చేరేందుకు తన పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్పించాడనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరినా సుజనా చౌదరి టీడీపీ పాటనే పాడుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క జీవియల్, సోమువీర్రాజు వంటి ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు హ‍యాంలో జరిగిన అవినీతి బాగోతాలపై గళమెత్తుతుంటే..సుజనా మాత్రం బాబుగారిని సమర్థిస్తూ వాదించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా సీఎం జగన్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఏర్పడడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని వీడే ఆలోచనలో పడ్డారు. అయితే సీఎం జగన్ మాత్రం పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని తేల్చి చెప్పడంతో కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు వెనుకంజ వేశారు. కాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి రంగంలోకి దిగాడు. గురువారం నాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సుజనా భేటీ అయ్యాడు. ప్రాంతీయ పార్టీలకు ఏపీలో భవిష్యత్తు లేదని, బీజేపీలో చేరడం బెటర్ అని సుజనా వంశీకి చెప్పినట్లు సమాచారం. అయితే వంశీ మాత్రం వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలో నిన్న మంత్రులు కొడాలినాని, పేర్నినానితో కలిసి తాడేపల్లిగూడెంలో సీఎం జగన్‌ను కలిసాడు. సీఎం జగన్ చెప్పినట్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వంశీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు జగన్ కూడా వంశీ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది.

ఈ విషయం పక్కన పెడితే.. వంశీతో భేటీ అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంటికి వెళ్లిన సుజనా చౌదరి అక్కడే భోజనం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీకి ఫ్యూచర్ లేదని, బీజేపీలో చేరాల్సిందిగా సుజనా కరణం బలరాం‌కు చెప్పినట్లు సమాచారం. టీడీపీలో బాబు కంటే సీనియర్ కరణం బలరాం..అవసరమైతే చంద్రబాబును కూడా ఎదిరించేందుకు కరణం వెనుకాడడని పలు సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి, చీరాల నియోజకవర్గాలలో కరణం బలరాంకు ఉన్న బలం అంతా ఇంతా కాదు..కరణంలాంటి సీనియర్ ఎమ్మెల్యే, మాస్ లీడర్ బీజేపీలో చేరితే నిజంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవడం ఖాయం. అందుకే సుజనా చౌదరి కరణం ఇంటికి వెళ్లి లంచ్ చేసి మరీ బీజేపీలో చేరాల్సిందిగా కోరాడు. అయితే సుజనా ప్రయత్నాలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగా కమలం పార్టీ బలోపేతానికి ఇలా టీడీపీ ఎమ్మెల్యేలను కలుస్తున్నాడా..లేదా మళ్లీ మోదీ పంచన చేరేందుకు తపిస్తున్న చంద్రబాబు ప్లాన్‌‌ను అమలు చేస్తున్నాడా అన్న డౌట్లు ఇటు తెలుగుతమ్ముళ్లలో, అటు కాషాయనాథుల్లో తలెత్తుతున్నాయి. ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోతాననే భయంతో మళ్లీ మోదీ పాట పాడుతున్నాడు. అందుకే చంద్రబాబే స్వయంగా తన పార్టీ నేతలను సుజనా చౌదరి సాయంతో బీజేపీలో చేర్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు లోకేష్ అయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా సుజనా చౌదరి బీజేపీలోని బలోపేతం చేస్తున్నాడా..లేదా బాబుగారి ప్లాన్ అమలు చేస్తున్నాడా అన్న అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat