తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ మీడియాకు తెలిపారు.