తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “హుజూర్ నగర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. అందులో ఒక భాగం కాళేశ్వరంలో విజయం సాధించాం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ.గోదావరి నీళ్లతోటి పునీతం కావాలి. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలి. మహబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. తెలంగాణ సస్యశ్యామల తెలంగాణ కావాలన్నారు.మీ అందరి దీవెనలతో మీ సేవలో ముందుకుపోతానని మనవి చేస్తున్నా..వచ్చేసారి వచ్చినప్పుడు జాన్‌పహాడ్ దర్గా, మట్టపల్లి లక్ష్మీ నరిసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటా..అక్కడ కూడా అభివృద్ది జరగాలి. ఏ ప్రాంతానికి నీళ్ళు రాకపోయినా నాకు బాధగా ఉంటుంది.అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము. తెలంగాణలో ప్రతి ఇంచు నాదే అని అన్నారు.
