తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో ఇబ్బందిపడుతున్న బాలికల సౌకర్యం కోసం సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపి సంతోష్ కుమార్ తక్షణమే తన ఎంపీలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేశారు. దీనివల్ల మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లల పాలిట అన్నయ్య లాగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ప్రజల పట్ల తన నిబద్ధతని ప్రేమను చూపించుకోవడానికి ఎల్లప్పుడూ ముందుండే ఎంపీ సంతోష్ కుమార్ గారు ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో అడవుల పెంపకం పరిరక్షణ ధ్యేయంగా మూడు కోట్లకు పైగా మొక్కలను నాటి గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో విప్లవాన్ని ప్రారంభించారు.అంతేకాకుండా కీసర రిజర్వ్ ఫారెస్ట్ ని దత్తత తీసుకుని ఎకో ఫ్రెండ్ పార్క్ గా కూడా మార్చిన సంగతి తెలిసిందే..
Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A
— Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019