తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం , హరితహారం నిర్వహణ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హారీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదు.పంచాయతీ ప్రణాళికతో పల్లెల రూపురేఖలు మారాయి… 70 ఏళ్ల దరిద్రం కొట్టుకుపోయింది.దేశంలో ఎక్కడికి పోయినా , ఏ కార్యక్రమం అయిన తెలంగాణ మోడల్ గా నిలిచింది.
దాని ఫలితమే హుజూర్ నగర్ విజయం.. ప్రతి పక్షాలకు హుజుర్ నగర్ ఫలితం ఒక చెంపపెట్టు.ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడారు.. ఏమైంది కొందరి డిపాజిట్లు పోయాయి… ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.దేశంలో 24 గంటల కరెంఠ్, మిషన్ భగీరథ ఇవి ఒక్క తెలంగాణలోనే అమలు.. దేశం మొత్తం తెలంగాణ లాగా ఉండాలంటున్నారు..తెలంగాణాను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మెచ్చుకున్నారు… ఇవన్నీ హుజూర్ నగర్ ప్రజల అనుభవంలో ఉన్నాయి.. కాబట్టే ఇంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు.. ఎన్నిక ఏది అయిన ఎగిరెది గులాబి జెండానే . మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఫలితాలే వస్తాయి … రాష్ట్రంలో 2635తండాలు పచాయీతీలు చేశాం …12, 751 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, సీఎం కేసీఆర్ గారి ఘనత..నెలకు 339 కోట్లు పంచాయతీలకు ఇస్తున్నాం… 70 ఏళ్ల స్వతంత్ర్యంలో ఏ పంచాయతీకి ట్రాక్టర్లు లేవు… టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిధులు, సిబ్బంది , ట్రాక్టర్లు ఇచ్చాం.. 948 పాత బావులను, 575 పాత బోర్ వెల్స్ , 2738 పెంట కుప్పలను సంగారెడ్డి జిల్లాలో పూడ్చి వేశాము..
పల్లెల్లో పారిశుధ్య రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించాం… రేపటి నుండి ప్రతి పల్లెలో చెత్త బండి వచ్చింది అనే పాట.రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ట్రాక్టర్ల పంపిణీ సంగారెడ్డి జిల్లాలో నే చేస్తున్నాం …డబ్బులకు ఇబ్బంది లేదు.. ఈజీఎస్, పంచాయతీ డబ్బులు ఎన్నైనా ఇస్తాం …. గ్రామాల్లో ఎవరు మొదట వైకుంఠ దామం , డంప్ యార్డులు నిర్మాణం పూర్తి చేస్తారో ఆ ప్రజా ప్రతినిధులకే ఫస్ట్ సన్మానం.. ఫస్ట్ జనవరి కల్లా గ్రామ పంచాయతీలో డంపు యార్డు, గ్రేవ్ యార్డులు పూర్తి చేయాలి… సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా మారాలి… సీఎస్ఆర్ కింద సంగారెడ్డి జిల్లాలో 750 కిలో మీటర్లు ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టాం…సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీలలో ఎల్ఈడీ లైట్లు పెడతాం.. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పని తీరు మెరుగు పరుచుకోవాలి.. అందరం టీం వర్క్ చేద్ధాం.ఎన్నికల తరువాత మున్సిపాలిటీలలో 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం” అని అన్నారు…
Tags huzur nagar by election kcr MINISTER HARISH RAO sangareddy slider tanneeru harish rao telangana finance minister telanganacm trs trs governament