ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తో భేటీ అవ్వడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. అయితే ఇంతకుముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీ ఎంపీ ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీతో భేటీ అయ్యారు.