ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి,టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరీతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం.
మరో పదేళ్ల వరకు టీడీపీ అధికారంలోకి రాకపోవడం. నాడు అధికారంలో ఉన్న కానీ చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీని పట్టించుకోకపోవడం. టీడీపీకి భవిష్యత్ ఉండకపోవడం ఇలా పలు అంశాలు గురించి ఆలోచించిన వంశీ బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని చర్చలు జరిగాయి అని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వల్లభనేని వంశీ బీజేపీలో చేరతారని ఆయన అనుచరవర్గం చెబుతున్నారు.