రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమ కారుడు తెలుగుదేశం పార్టీ నేత కర్నూలు జిల్లా రాజకీయ ఉద్దండుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీని వీడుతున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఆయన పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాల కోసం గానీ పార్టీ విజయం కోసం గాని ఆయన కృషి చేయలేదు. ఒక రాజకీయ పార్టీలో కొనసాగాలా అనే భావనతోనే ఆయన టిడిపిలో ఉన్నారంటూ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది నాయకులు ఆయనను విమర్శించారు. అయితే తాజాగా టీడీపీని బైరెడ్డి వీడుతారనే తెలుస్తోంది. గురువారం సాయంత్రం టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. మరిముఖ్యంగా జిల్లాలోనే అత్యంత బలమైన నాయకుడిగా పేరుగాంచిన బైరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడితే ఆ పార్టీలో ఇంకా ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవలేదు. ఈ క్రమంలో బై రెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు.