టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు… వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో జరిగిన చేదు ఘటనను చెప్తూ మళ్లీ పాతాళ గంగలా మారింది. అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ‘అందరు అమ్మాయిల లాగే నా జీవితంలోనూ రిలేషన్షిప్స్ ఉండేవి. అతనితో అంతా బాగుంది అనుకున్న సమయంలో డిస్టబెన్స్ ఎదురయ్యాయి. ఓ రోజు ఆకస్మాత్తుగా స్టేజీపై యాంకరింగ్ చేస్తున్నపుడు నాకు బ్రేకప్ అయిపోయిందన్న వార్త వచ్చింది. నేను పక్కకు వెళ్లి ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అవన్నీ పక్కనపెట్టి.. అప్పుడు నేను చేస్తున్న కామెడీ షోను నవ్వుతూనే పూర్తి చేశాను. బ్రేకప్ తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఆ విషయం కోసం అంత ఫూలిష్‌గా ప్రవర్తించాను అనిపిస్తుంది. సో.. ఒక అమ్మాయి ఆర్థికంగా ఎదిగిన తర్వాతే లవ్వు, గివ్వు వంటివాటి కోసం ఆలోచించండి. ఫ్యామిలీ తర్వాతే మిగతా వాటిని పట్టించుకోండి’ అని సలహా ఇచ్చింది. అయితే ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరును మాత్రం చెప్పుకోడానికి ఇష్టపడలేదు. దీంతో శ్రీముఖికి బ్రేకప్ చెప్పిన అతడు ఎవరు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.