మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు.
అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. శివసేన తరపున కొంత కాలం ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ జాతీయ అధ్యక్షుడు,హోం మంత్రి అమిత్ షాతో మొదట్లోనే ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారని సమాచారం.
అయితే శివసేనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి షాకిస్తూ శివసేన అస్థాన పత్రిక అయిన సామ్నాలో ఎన్సీపీపై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రజలు భారీ విజయాన్ని ,స్పష్టమైన తీర్పునిచ్చారు అని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఎన్సీపీను చూసి బీజేపీ నేర్చుకోవాలని .. ఇది కేవలం ప్రజాతీర్పు కాదని.. కేవలం తీర్పు మాత్రమే అని బీజేపీకి షాకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.