జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు కత్తి 50 కిలో మీటర్లకు ఒక క్లినిక్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి వైయస్సార్ అత్యవసర చికిత్స అనే పేరును కూడా ఖరారు చేశారు ఇప్పటికే ఈ పథకానికి 72 కోట్ల రూపాయల నిధులు కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే సీఎం జగన్ ప్రజా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
