తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27 న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం6.00 నుండి 9.00గంటలవరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులోభాగంగా ఆలయాన్ని శుద్ధిచేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ ద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం ఉదయం 9.30గంటలనుండి భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోశాంతి, ఏఈవో తిరుమలయ్య, సూపరింటెండెంట్ రమేష్, ఆలయఅర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. కోదండ రామాలయంలో దీపావళి సందర్భంగా ఈనెల 27వ తేదీ ఆదివారంరాత్రి 7.00 గంటలకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంనుండి నూతనవస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీ కోదండరామ స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆ స్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈసందర్భంగా అమావాస్య నాడు ఆలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవలను టిటిడి రద్దుచేసింది.