తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు.
కార్మికులు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకుని ఉద్యోగాల్లో చేరవచ్చు . దానికి ఎవరు అభ్యంతరం చెప్పరని “తేల్చి చెప్పిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ ఇంకో ఐదారు రోజుల్లో ఈ వివాదానికి తెరపడుతుందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఆర్టీసీ కార్మికులతో చర్చలు అనే వార్తల్లో నిజముండోచ్చని కథనాలు వస్తోన్నాయి.