ప్రముఖ దర్శకుడు ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపు ని ప్రోత్సహించ కపోవడం చాలా శుభపరిణామమన్నారు .ఎవరైనా పార్టీ మారారు చూస్తే పదవికి రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేయడం ఎంతో విలువలతో కూడిన నిర్ణయం అన్నారు. జనాభా ప్రకారం బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించిన దేశంలో ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్ అన్నారు . ప్రజాస్వామ్యం అనే సినిమాను అందరూ చూడాలని చూసి ఇ ప్రతి ఒక్కరికి చూపించాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారతదేశంలో ఎమ్మెల్యే 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్ ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని మార్చారు సంపద అయిన ఇసుకను ఏ వ్యక్తుల చేతుల్లో లేకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని ఇలా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని ఆయన అన్నారు.