ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..అది నా ఘనత అని గొప్పలు చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..గతంలో సింధూ ఒలంపిక్‌పతకం సాధిస్తే..అది నా ఘనతే అని..సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటే..అది నా ఘనత అని చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటాడు. ఆఖరికి విషాదంలో కూడా పబ్లిసిటీ కోరుకునే రకం చంద్రబాబు అని మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 51మంది చనిపోయారు. 13 మంది మృతదేహాల ఆచూకీ దొరకలేదు. బోటు ప్రమాదంపై విమర్శలు చెలరేగిన దరమిలా వైసీపీ ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్‌కు బోటు వెలికితీత పనులను అప్పగించింది. గత కొద్ది రోజులుగా ధర్మాడి సత్యం టీమ్ ఎంతో శ్రమపడి బోటును బయటకు తీశారు. బోటులో చిక్కుకుపోయిన మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. దీంతో ధర్మాడి సత్యం టీమ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..వెంటనే వాళ్లను సన్మానించి తన గొప్పలు చెప్పుకుని, ప్రత్యర్థులను తిట్టే చంద్రబాబు ధర్మాడి సత్యం విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. ఇవాళ రాయల్ వశిష్ట బోటును వెలికితీసిన ధర్మాడి సత్యాన్ని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను పంపించి సన్మానం చేయించాడు. అలాగే స్వయంగా చంద్రబాబు సత్యాన్ని అభినందిస్తూ ఓ లెటర్‌ను పంపాడు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చలూరులో పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. కాని మీరు కుటుంబాలను వదలి, అన్నపానీయాలు మాని, జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు పడిన తపనను తెలుగు దేశం పార్టీ మనస్ఫూర్తిగా అబినందిస్తోంది అంటూ బాబు ధర్మాడి సత్యానికి పంపిన లేఖలో పేర్కొన్నాడు.
కాగా చంద్రబాబు తీరుపై తూగో జిల్లా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం 39 మందికి చావుకు కారకుడైన చంద్రబాబు ఇప్పుడు అదే గోదావరినదిలో బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా నెల రోజుల తర్వాత బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను సన్మానించి సిగ్గులేకుండా ఎల్లోమీడియాలో పబ్లిసిటీ చేయించుకుంటున్నాడని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు తీరుపై వైసీపీ మంత్రి కన్నబాబు కూడా మండిపడ్డారు. ఓటమితో చంద్రబాబుకు మతిపోయిందని కన్నబాబు దుయ్యబట్టారు. బోటు వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడం తప్పుకాదు కానీ.. ధర్మాడి సత్యానికి చంద్రబాబు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. బోటు పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా?… బోటు ప్రమాద బాధిత కుటుంబాలను.. చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? అని మంత్రి కన్నబాబు సూటిగా ప్రశ్నించాడు. ధర్మాడి సత్యాన్ని సన్మానించడం తప్పులేకపోయినా..బోటు ప్రమాదంలో చిత్తశుద్దితో వ్యవహరించిన జగన్ సర్కార్‌ను తిట్టడం చూస్తుంటే…చావులో కూడా రాజకీయం చేసే నీచమనస్తత్వం చంద్రబాబుది అని మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సన్మానాలు, లెటర్లపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. . ఆఖరికి ధర్మాడి సత్యాన్ని కూడా వదల్లేదా..చంద్రబాబు..ఎవరు ఎక్కడ ఏ ఘనత సాధిస్తే..అక్కడకు వాలిపోయి..గొప్పలు చెప్పుకుని, ప్రత్యర్థులను తిట్టడమేనా..నీ పబ్లిసిటీ పిచ్చి తగలెయ్య..అని నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.