ఏపీ టీడీపీ సీనియర్ నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైలులో ఉండగా, కూన రవికుమార్, యరపతినేని, సోమిరెడ్డి, కోడెల శివరామ్ వంటి టీడీపీ నేతలపై నమోదైపోయిన కేసులపై విచారణ జరుగుతోంది. తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత , టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. సెప్టెంబర్‌లో చంద్రబాబు తన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ “ఛలో ఆత్మకూరు ” కు పిలుపు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న అచ్చెంనాయుడు తదితర టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు..” ఏయ్ ఎగస్ట్రాలు చేయద్దు..నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు..” అంటూ ఎస్పీ విక్రాంత్ పటేల‌్‌ని దుర్బాషలాడాడు. పోలీసులను యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టడమే కాకుండా వారు ఆపుతున్నా, వినకుండా తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. అచ్చెన్నాయుడు దురుసుప్రవర్తనపై ఆగ్రహించిన పోలీసులు మంగళగిరిలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్ట్ నుంచి ముందస్తు బెయిల్ పొందిన అచ్చెన్నాయుడు..న్యాయస్థానం సూచనల మేరకు పూచికత్తు సమర్పించేందుకు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యాడు. ఈ కేసులో రూ.50వేల పూచికత్తుతో అచ్చెన్నాయుడుకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో విచారణ మాత్రం ఇంకా కొనసాగుతుంది. కాగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్పప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకం పెట్టిరావాలి అధ్యక్షా..అని అసెంబ్లీలో నోరుపారేకునేవాడు. సరిగ్గా ఇవాళ శుక్రవారం అచ్చెంనాయుడు కోర్టు ముందు హాజరై సంతకం పెట్టి బెయిల్‌పై వచ్చాడు. దీంతో శుక్రవారం..కోర్టు..సంతకం అని వాగివాగి ఆఖరికి నువ్వు కూడా శుక్రవారం నాడు కోర్టుకు వెళ్లి సంతకం పెట్టి వచ్చావుగా అచ్చెం..అందుకే అంటారు..నోరు ఉంది కదా అని ఎగిరెగిరిపడితే ఆఖరికి నీకు కూడా అదే గతి పట్టిందని..వైసీపీ అభిమానులు అచ్చెంను చెడుగుడు ఆడేసుకుంటున్నారు