తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కోడెల అక్రమాస్తుల కేసుల విషయంలో కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం పీఏ నాగప్రసాద్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక అక్రమ వ్యవహారాల్లో ప్రసాద్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అంతేకాకుండా కోడెల అండ చూసుకుని కోడెల పేరు చెప్పుకొని ప్రసాద్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కోడెలకు సంబంధించి జరిగిన కొన్ని కేసుల విచారణలో ప్రసాద్ పేరు కూడా బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి ఎట్టకేలకు ప్రసాద్ ను అరెస్టు చేశారు. ప్రసాద్ ల్యాండ్ సెటిల్మెంట్లు బెదిరింపులు చేస్తూ అనేక అక్రమ సంపాదనను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా కోడెల కుటుంబంలో జరిగే ఆర్థిక లావాదేవీలు కీలక పాత్ర పోషించి తాను కొంత సొమ్ము వెనకేసుకున్నారు. తాజాగా నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ప్రసాద్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.