Home / ANDHRAPRADESH / ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనమా..మండిపడిన హైకోర్ట్..!

ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనమా..మండిపడిన హైకోర్ట్..!

2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఓట్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి మోదీని దింపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు..ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే చంద్రబాబు హోదా కోసం ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 11 న ఢిల్లీలో బాబుగారు ప్రత్యేక హోదాపై ధర్మ పోరాట దీక్ష అంటూ ఓ దొంగ దీక్ష చేశారు. ఆ దీక్షలో దివ్యవాణి, శివాజీ వంటి తన కుల ఆర్టిస్టులతో మోదీని బూతులు తిట్టించి నవ్వుకున్నాడు. అయితే ఈ దొంగ దీక్షకు టీడీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్యకర్తలను ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి తరలించారు. వారికి సకల సౌకర్యాలు కల్పించారు. బాబుగారి ఒక రోజు డ్రామా దీక్ష కాస్త..టీడీపీ నేతల విహారయాత్రలా సాగింది. అయితే పార్టీ కార్యక్రమంలా నిర్వహించాల్సిన ఈ డ్రామా దీక్షకు చంద్రబాబు ఏకంగా రూ. 10 కోట్ల ప్రజల డబ్బును అప్పనంగా ఖర్చుపెట్టాడు ఆఖరికి రూ. 4 కోట్ల టీటీడీ నిధులను కూడా టీడీపీ నేతల హోటళ్లకు, విందులకు వాడేశారు. బాబుగారు ఇలా వ్యక్తిగత మైలేజీ కోసం ప్రజల ధనాన్ని ఖర్చుపెట్టడంపై ఏపీ హైకోర్ట్‌లో కొందరు వ్యక్తులు పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటీషన్‌‌ను విచారించిన హైకోర్ట్…ఏంటీ ఒక రోజు దీక్షకు 10 కోట్లు ప్రజల డబ్బును ఖర్చుపెట్టారా అంటూ నోరెళ్లబెట్టింది. రాజకీయలబ్ది కోసం చేపట్టిన ఈ దొంగ దీక్షకు రూ. 10 కోట్లను ఎందుకు కేటాయించారో..అసలు ఈ డబ్బును బాబుగారి దీక్షకు మళ్లించిన అధికారులు ఎవరో తెలపాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ దీక్షకు ఖర్చుపెట్టిన డబ్బంతా ప్రజలు పన్నులు రూపంలో చెల్లించిందని,,ఇలా రాజకీయ కార్యక్రమాలకు వాడే అధికారం ఎవరికీ లేదని..జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు ప్రజాధనాన్ని వృథా చేసే అధికారం అధికారులకు, రాజకీయ నాయకులకు ఎవరిచ్చారని హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తివివరాలను తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను నవంబర్ 21కు వాయిదావేసింది. హైకోర్ట్ ఆదేశాలతో 4 కోట్ల టీడీడీ నిధులతో సహా, మొత్తం రూ. 10 కోట్లను ఏ ప్రభుత్వ ఖాతా నుంచి దీక్షకు మళ్లించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ పదికోట్లను దీక్షకు కేటాయించిన అధికారులు ఎవరు..వారికి నాటి టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.మొత్తంగా ఈ కేసు చంద్రబాబుతో సహా ఆయనకు సహకరించిన అధికారులకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat