దీపావళి, క్రిస్మస్ పండుగ సీజన్ నేపథ్యంలో.. భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనున్నది. సుమారు 200 ప్రత్యేక రైళ్లు.. దాదాపు 2500 అదనపు ట్రిప్పులు తిరుగుతాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌కతా, ముంబై, లక్నో, గోరక్‌పూర్, చాప్రా స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వివిధ రైల్వే జోన్లలోనూ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. రిజర్వేషన్ లేని బోగీల వద్ద ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపేందుకు ఆర్‌పీఎఫ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అన్ని ముఖ్య స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు పనిచేయనున్నాయి.
