టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. రీసెంట్‌గా అమరావతి వంటి బంగారు బాతును చంపేశారంటూ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశాడు. తాజాగా చంద్రబాబు విమర్శలకు విజయసాయిరెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. వర్షాలు కురిస్తే ‘జలపాతాలు’ కనువిందు చేసే నాలుగు తాత్కాలిక భవనాలు కట్టించి అమరావతిని హత్య చేశారు, బంగారు బాతును చంపేశారు అంటూ నారా చంద్రబాబు నాయుడు విలపిస్తున్నాడు…భూముల ధరలు ఆకాశాన్ని తాకాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మైండ్ తో ఐదేళ్ల పాటు అలా వదిలేశాడు. ఆ పాపం ఆయనదే అంటూ..విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గత ఐదేళ్లలొ టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ స్నాక్స్ కోసం ఖర్చుపెట్టిన డబ్బులపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టులో నారావారి పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా నారాలోకేష్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా? లేదా ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తంగా ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ప్రస్తుతం బాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
