తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి.
అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ నుండే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మొత్తం పది రౌండ్లు ముగిసేసరికి శానంపూడి సైదిరెడ్డి ఇరవై వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై అధిక్యంలో ఉన్నాడు. ఇంకా పన్నెండు రౌండ్లు కౌంటింగ్ ఉంది.
అయితే మొదటి నుండి ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉంటుందని భావించిన కానీ ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలతో ఎలాంటి ప్రభావం లేదని ఆర్ధమవుతుంది. కాంగ్రెస్ కు అడ్డా అయిన హుజూర్ నగర్ ఇక నుండి టీఆర్ఎస్ పార్టీకి గడ్డగా మారబోతుంది అన్నమాట.