తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
