దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. ఆర్టికల్ 370రద్దు, స్థానిక పరిస్థితులు బీజేపీకి అనుకూలించాయా..? లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలించాయన్నది ఈ రోజు సాయంత్రం వరకు తెలుస్తుంది.